రామ్ మెడికల్& జనరల్ షాపును ప్రారంభించిన బండారు శ్రీనివాస్

  • అన్ని రంగాల్లో యువత ముందుండాలి!.. పలువురికి దారి చూపించాలి!.. అదే జనసేనాని ఆశయం.. బండారు శ్రీనివాస్ పిలుపు!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, ఆలమూరు టౌన్ నందు రాజుగారి దివాణం దగ్గర, స్థానిక ఎమ్మార్వో వారి కార్యాలయం సెంటర్ మెయిన్ రోడ్డు కు అతి సమీపంలో, మెయిన్ రోడ్ పై ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో రామ్ మెడికల్ అండ్ జనరల్ షాపును శుక్రవారం కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి, జనసేన పార్టీ రథసారథి బండారు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని పలువురు జనసైనికులు, కార్యకర్తలతో ఆలమూరులో ఘనంగా షాపును ప్రారంభించి.. షాపు యాజమాన్యానికి ఆశీస్సులు అందజేశారు. ఈ షాపు యజమాని కొండేటి రాంబాబుకు చెందినది. ప్రముఖ జనసేన వీర మహిళ, ప్రముఖ కార్యకర్త కొండేటి హేమాదేవి భర్త వారి తమ్ముడు రాంబాబు, జనసేన పార్టీ ఆలమూరు వీర మహిళ హేమా దేవి మరిది కె రాంబాబు చేత ఈ షాపును జన సైనికులు, కార్యకర్తలు పలువురు ఆహ్వానం మేరకు వచ్చి అంగరంగ వైభవంగా షాపును ప్రారంభించి ఉన్నారు. ఈ షాపు ప్రారంభ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజు, మహాదశబాబులు, చింతపల్లి సత్తిపండు, పడాల అమ్మిరాజు, చల్లా బాబి, సిరిగినీడి పట్టాభి, చల్లా వెంకటేశ్వరరావు, కోట వరలక్ష్మి సూరపు రెడ్డి సత్య, నాగిరెడ్డి మహేష్, కట్టారాజు, పెట్టా రంగనాథ్, కొండేటి హేమాదేవి, పలువురు ప్రముఖులు జనసైనికులు పాల్గొన్నారు.