నిత్యవసర సరుకుల ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: దారం అనిత

నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన నడుస్తోంది. 2014లో 430 రూపాయలు ఉన్న గ్యాస్ ధర నేడు వీని వందకు పెంచారు. పెట్రోల్ ధర 70 రూపాయలు, 60 రూపాయలు డీజిల్ ధర ఉంటే నేడు పెట్రోల్ 112, డీజిల్ 105 కు పెంచారు. పక్క రాష్ట్రాల్లో లీటరుకు పది రూపాయలు తక్కువ ఉంది. ఏపీలో ఉన్నందుకు ముఖ్యమంత్రికి సుంకం చెల్లించాల్సి వస్తుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపాల్, శ్రీలంకలో కూడా ఇంత ధరలు లేవు. టమేటా ధరలు పడిపోతున్నాయని వాటి గురించి మాట్లాడే నాయకుడే లేడు.. సంవత్సరంలో 700 మంది రైతులు బలవన్ మరణాలు చేసుకుంటున్నారు. కరోనా వచ్చిన తర్వాత మందుల ధరలు 30 శాతం పెరిగాయి.. కరోనా సమయంలో ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే ధరలు ఎలా పెంచుతారు అని ప్రశ్నిస్తున్నాం.. జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగకపోగా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేశారు. వెంటనే నష్ట ప్రభుత్వం నియంత్రణ చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలను ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేసారు.