కుంగిన రోడ్డు మరమ్మతు చేపట్టాలని జనసేన నిరసన

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొలునుకొండ వడ్డేశ్వరం వంతెన వద్ద కుంగిన రోడ్డు.

జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు.. తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు ఆధ్వర్యంలో రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ తరుపున నిరసన తెలియజేయడం జరిగింది.

తదనంతరం జనసేన పార్టీ తాడేపల్లి మండలం అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 12 వ తేదీన రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఈ రోడ్డుకి శ్రమదానం చేశారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు.

మళ్ళీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిజిటల్ క్యాంపెనింగ్ మొదలు పెట్టారని తెలిసి హడావిడిగా అప్పటికి అప్పుడు కంటి తుడుపుగా రోడ్డు వేశారు.

రెండు నెలల కాల వ్యవధిలోనే ఈ రోడ్డు కుంగిపోయింది. అంటే ప్రభుత్వం ఇటువంటి నాసిరకం రోడ్లతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. కుంగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని.. చేయని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, తాడేపల్లి నాయకులు శెట్టి రామకృష్ణ, తిరుమలశెట్టి శ్రీధర్, ఇప్పటం గ్రామ నాయకులు తిరుమల శెట్టి నరసింహారావు, తాడేపల్లి మండలం ఐటీ విభాగం సభ్యులు శంకర్ శెట్టి కృష్ణమోహన్, జనసైనికులు షేక్ షఫీ, నీలాద్రి వంశీ, సేలం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.