రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలపై ప్రశ్నించిన దాసరి రాజు ..

ఇచ్చాపురం మండలం, తిప్పనపుట్టుగ గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి అని.. ఇస్తున్న బియ్యంలో కేజి నుండి 2కేజి ల వరకు తక్కువగా ఉంటున్నాయి అని.. జనసైనికులు ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు దృష్టికి తీసుకొని రాగా.. బుధవారం ఉదయం 8 గంటలకు బియ్యం పంపిణి చేస్తున్న డీలర్ దగ్గరకు వెళ్లి నిలదియగా… సెంట్రల్ నుండి వచ్చేటప్పుడు.. కేజీ నుండి 2 కేజీ ల వరకు తక్కువగా ఉంటుంది అని చెప్పాడు.. అక్కడ ఉన్న చాలా మంది మాకు ఇచ్చే బియ్యంలో కేజీ. నుండి 2 కేజీ ల వరకు తక్కువ ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ప్రతి కార్డ్ దగ్గర కేజీ నుండి 2కేజీ ల వరకు తగ్గితే ఎలా అని అడిగితే.. ఇక్కడే కాదు మండలం మొత్తం ఇలానే జరుగుతుందని.. ఒక ఇద్దరికి బియ్యం ఇచ్చి అక్కడి నుండి హుటాహుటినవెళ్లిపోవడం జరిగింది. అక్కడ సుమారుగా ఒక 70 ఏళ్ల ముసలమ్మ పేరు తిప్పన వాసుదేవి మాట్లాడుతూ మాలాంటి వాళ్ళ కి ఇస్తున్న బియ్యంలో కేజీ, 2 కేజీలు తక్కువగా ఇస్తే మేము ఎవరికి చెప్పాలో తెలియదు అని బాధపడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని..లేని ఎడల జనసేన తరుపున తీవ్ర పోరాటం చేయాల్సి వస్తుందని దాసరి రాజు హెచ్చరించారు.