జనసేన పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జనసేన పార్టీ నాయకుడు మత్స పుండరీకం హార్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. నడుకూరు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆలయాలకి, షాపులకు జాతీయ జెండాలు స్వచ్ఛందంగా పంపిణీ చేశారు. అనంతరం పుండరీకం మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసారని, వారందరి త్యాగ ఫలమే భారతదేశం స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. నాటి స్వాతంత్ర్య ఉద్యమ వీరులకు గుర్తుగా డబ్భై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం – ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా రెపరెపలాడలని, భారతదేశం సమైఖ్యత చాటి చెప్పలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, చింత గోవర్ధన్, వాన కైలాష్ లు పాల్గొన్నారు.