హ్యాపీ బర్త్ డే .. మెగా బ్రదర్

టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికి తెలుసు. మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు హీరోగా , సహాయ నటుడిగా , నిర్మాతగా రాణించారు. 1961 అక్టోబర్ 29 వ తేదీన నాగబాబు మొగల్తూరూలో జన్మించారు. ఈరోజు నాగబాబు పుట్టినరోజు. చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమాతో నాగబాబు నిర్మాతగా మారారు. 1988లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తో త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, స్టాలిన్ సినిమాలు తీశారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమా నిర్మించారు నాగబాబు. ఆతర్వాత చిరు తనయుడు రామ్ చరణ్ తో ఆరంజ్ అనే సినిమాను నిర్మించారు. ఆ సినిమాలు నిరాశపరచడంతో నిర్మాతగా నాగబాబు సక్సస్ కాలేకపోయారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు నాగబాబు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కామెడీ షోలకు జేడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాజకీయంగానూ నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.