చిరంజీవి యువత మరియు మడకశిర జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలు

మడకశిర, చిరంజీవి యువత అధ్వర్యంలో పద్మభూషణ్ చిరంజీవి 67వ జన్మదిన శుభాకాంక్షలు తేలియజేసిన మడకశిర నియోజకవర్గం చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ఫాన్స్ అసోసిఏషన్. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో మడకశిర గవర్నమెంటు హాస్పిటల్ నందు రోగులకు పాలు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎవరికైనా అత్యవసర పరిస్థితిలో రక్తం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత మడకశిర నియోజకవర్గం అద్యక్షులు కె.ఎస్ వెంకటేష్ గుప్తా, మడకశిర పట్టణ అధ్యక్షుడు టి.యశ్వంత్ పవన్ కళ్యాణ్ చిన్ని హరీష్ వెంకటేశ్ శ్రీకాంత్ పాల్గొన్నారు.