కర్నాటక డాన్సు అకాడమిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

కర్నాటక, అఖిల కర్నాటక పవన్ కళ్యాణ్ జనసేన టీమ్ అఖిల భారత చిరంజీవి యువత నాయకులు ఉమేష్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు బాలాజీ నాయుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆధ్వర్యంలో కర్నాటక వైట్ ఫీల్డ్ లో కర్నాటక డాన్సు అకాడమిలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, జిల్లా సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్, వైట్ ఫీల్డ్ ఏరియా ప్రముఖులు మరియు డాన్సు అకాడమీ పిల్లలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అతిధులు, కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ కల్మషం లేని మనస్తత్వం ఉన్న మహానుభావులు చిరంజీవి, కష్టపడి ఒక్కో అడుగు వేసుకుంటూ నేడు మెగాస్టార్ గా ప్రఖ్యాతిగాంచి ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తనకు ఆ స్థాయి ఇచ్చినటువంటి తన అభిమానులకు తన వంతుగా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా వైద్య సేవలు అందించడానికి ఒక ఆసుపత్రి నిర్మాణానికి నడుంబిగించిన మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. తదుపరి పారిశుద్ధ్య కార్మిక మహిళలకు నూతన వస్త్రాలు అందజేసి అతిధులను గౌరవప్రదంగా సన్మానించిన ఉమేష్ మరియు బాలాజీ నాయుడు.