ఘనంగా రాజోలు జనసేన నాయకులు కోళ్ళ బాబీ పుట్టినరోజు వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలులో చెవిటి, మూగ పాఠశాలలో రాజోలు మండల జనసేన అధ్యక్షులు సూరిశెట్టి శ్రీను అధ్యక్షతన జనసేన యువ నాయకులు కోళ్ళ బాబీ పుట్టినరోజు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేసి అనంతరం జిల్లా అధ్యక్షులు గుండబత్తుల తాతాజీ మరియు సూరిశెట్టి శ్రీను కలిసి కేక్ కట్ చెయ్యటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు గ్రామ శాఖ అధ్యక్షులు కాట్న రాజు, రాజోలు టౌన్ ప్రెసిడెంట్ యర్రంశెట్టి బాబీ, ఉల్లిశెట్టి అన్నపూర్ణ, ఉల్లంపర్తి దర్శనం, సాధనల వెంకన్నబాబు, రేఖపల్లి శ్రీను, చింత ప్రసాద్, కిరణ్, బద్రి, సాయి జనసైనికులు పాల్గొన్నారు.