వినాయకుని మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం సృష్టిస్తున్న ఆంక్షలు తగదు

పాలకొండ, ఆధ్యాత్మిక భావనను ప్రభుత్వం గౌరవించి, సహకరించాలే తప్ప ఆర్థిక భారం వేసి నిబంధనల పేరిట వినాయక చవితి ఉత్సవానికి అడ్డంకులు సృష్టించడం భావ్యం కాదు. ఆలాగే విఘ్నాలు తోలిగించే వినాయకచవితి పండగ మండపాలు విషయంలో గందరగోళాలను, ఆంక్షలను తక్షణమే పరిష్కరించాలని, మండపాలు ఏర్పాట్లకు రోజు 1000/ కట్టాలి అని, ప్రతి డిజే బాక్స్ లకు 100 చలనా, చవితి ఉత్సవానికి కరెంట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా చలానాలు అంటూ గందరగోళం సృష్టిస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింపులులాంటి ఆలోచన ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని, కుల మతాలకతీతంగా ప్రజలు ఎంతో విశ్వాసం నమ్మకంతో వినాయక చవితి పండగ అత్యంత ఘనంగా భక్తి శ్రద్దలతో, నిర్వహించుకోవడం అందులో అన్ని వర్గాల వారు పాలుపంచుకోవడం ఆనవాయితీ అని, జగన్ రెడ్డి మీ తండ్రి విగ్రహం వల్ల ప్రతి సెంటర్లో ఎంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి వాటికీ ముందుగా పన్ను చలాన్లు కట్టించి అప్పుడు వినాయక స్వామికి వసూలు చేయాలని జగన్ రెడ్డికి సూటిగా ప్రశ్నించిన జనసేన జానీ.