ప్లాస్టిక్ సంచులను కూడా బ్యాన్ చేయాలి: శోభన్ బాబు

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శనివారం ప్లాస్టిక్ బ్యానర్ ని బ్యాన్ చేస్తున్నాము అన్నారు బాగానే ఉంది కానీ వట్టి మాటలేనా చేతల్లో ఉండవా? గత మూడు సంవత్సరాలుగా కనిపించని పర్యావరణ పరిరక్షణ ఇప్పుడే ఈ వైసీపీ ప్రభుత్వానికి కనిపించిందా? జనసేన పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతున్నాం. సెప్టెంబర్ రెండవ తేదీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణంలో జనసేన శ్రేణులు అంగరంగ వైభవంగా బ్యానర్లు వేసుకొని పుట్టినరోజు పండుగను జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కొత్త కొత్త జీవోలు తెస్తున్నారు. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతంలో ముఖ్యమైన సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణ కావున ప్లాస్టిక్ నిషేధాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తోంది. ప్రజలను భాగస్వాములను చేయాలి. బ్యానర్ లనే కాదు ప్లాస్టిక్ సంచులను కూడా బ్యాన్ చేయాలని కార్వేటి నగరం మండల జనసేన అధ్యక్షులు శోభన్ బాబు అన్నారు.