అధ్యక్షులు ఏ కార్యక్రమం తలపెట్టిన ప్రజలలోకి దానిని బలంగా ముందుకు తీసుకొని వెళ్ళాలి: గాదె

పొన్నూరు నియోజకవర్గం, పెద్దకాకాని మండల అధ్యక్షులు వీరేళ్ల వెంకటేశ్వరరావు మండల కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని ముందుగా కమిటీ సభ్యులు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ ఎదుగుదలకు భవిష్యత్తులో మనం చేసే ఏ కార్యక్రమానికైనా పార్టీ ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని చేయాలి అని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎలాంటి అపోహలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని తెలియజేశారు. భవిష్యత్తులో పార్టీ ఎలాంటి పిలుపునిచ్చిన దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని చెప్పడం జరిగింది. మన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. నియోజకవర్గ మండల స్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించాలని అలాగే పార్టీలో యాక్టివ్ గా ఉన్న కార్యకర్తలను అధికార పార్టీ వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిసింది, అలాంటి సందర్భాల్లో నాయకులుగా మనమందరం మన కార్యకర్తలకు ఎలాంటి ఆపదలు వచ్చిన ముందుండి వారికి భరోసా కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, మారుతి, బండారు అప్పారావు, ఉపాధ్యక్షుడు పరికండ్ల శేషయ్య, ప్రధాన కార్యదర్శి విన్నకోట సుబ్రమణ్యం, మండల లేని సీను, తడవర్తి అప్పారావు, వీరేళ్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి నాగేశ్వరరావు, కాలిశెట్టి సహదేవరావు, నాగబాల రత్నకుమారి, మాధవి, సుజాత మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.