జనసేన కార్యాలయ ప్రారంభం కోసం సమావేశం

పుట్టపర్తి నియోజకవర్గం, పెడబల్లి గ్రామంలో సెప్టెంబర్ 4వ తేదీన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా ఆదివారం సాయంత్రం నిడిమామిడి పంచాయతీలోని కార్యకర్తలను మరియు పవన్ కళ్యాణ్ అభిమానులను జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ మరియు నాయకులు వెంకటేష్ నాయక్, శ్యామ్ సుందర్, నరేంద్ర, మరియు తదితర నాయకులు వెళ్లి స్థానిక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని వారితో చర్చించి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని అదేవిధంగా కార్యాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మరియు జిల్లా నాయకులు విచ్చేస్తున్నారు అని తెలియపరచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారికి సూచించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పలువురు పెద్దలతో మాట్లాడి కార్యకర్తలకు అండగా నిలవాలని కోరడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు వచ్చిన అండదండలుగా ఉంటామని అదేవిధంగా పై స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్, పుట్టపర్తి మండలం నాయకులు వెంకటేష్ నాయక్, శ్యామ్ సుందర్, నందీష్ రమణ, పురుషోత్తం, గిరి, కృష్ణ, దడిగుంటి నరేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.