అవినీతి నిరోధకశాఖ అధికారుల నివేదికను బహిర్గతం చేయాలి

విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నాలి దినకర్ పుందకర్ కి స్పందన కార్యక్రమంలో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలను యదేచ్చగా ప్రోత్సహిస్తున్న వారిపై దాడులు నిర్వహించిన అవినీతి నిరోధకశాఖ అధికారుల నివేదికను బహిర్గతం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుండి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ విజయవాడ నగరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతూ యదేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల నివేదికను బహిర్గతం చేయాలని, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎన్ని నిర్మాణాలపై దాడులు చేశారో, డిపార్ట్మెంట్ పరంగా తమరు ఏ చర్యలు తీసుకున్నారో, సంబంధిత అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో తమరు నగర ప్రజలకు తెలియజేయాలని, సంబంధిత అధికారులు ఏమి జరగనట్టు ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు ఆరోపణలు ఉన్న వ్యక్తులపై కనీసం శాఖ పరమైన చర్యలు తీసుకోలేదంటే అవినీతిని ప్రభుత్వం పెంచి పోషిస్తుందా అని అనుమానం ప్రజలకు కలుగుతుందని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఏసీబీ వారి నివేదికను బహిర్గతం చేయాలని. క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది అక్రమ నిర్మాణాలను గుర్తించడం లేదా లేక గుర్తించి అధికార పార్టీ నాయకులకు అధికారులకు సమాచారం తెలియజేసి వాటాలు పంచుకుంటున్నారని అనే అనుమానం ప్రజల్లో తీవ్రంగా కలుగుతుందని. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కూడా ఒక బిల్డింగ్ యజమాని అధికార పార్టీ నాయకులు చేసిన ఆరోపణలు నగరంలో సంచలనం సృష్టించాయని అయినా అధికారుల మౌనం దేనికి సంకేతమో అర్థం కావడం లేదని విజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాలు పై ఆరోపణల కేవలం ఒక్క వ్యక్తి పైనే చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుందని అక్కడ ఉండే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కార్పొరేటర్ సచివాలయ సిబ్బంది పై ఎందుకు ఆరోపణలు రాలేదో ఇదంతా కావాలని ఏసీబీ దాడులను పక్కదారి పట్టించాలని అక్రమ నిర్మాణాలపై ప్రజల దృష్టిని మరిచాలని తద్వారా తమ జేబులు నింపుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే కొంతమంది వ్యక్తులు ఇటువంటి కుట్రలు చేస్తున్నారని అనుమానం మాకు కలుగుతుందని దీనిపై కూడా మా సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.