నాయకుడుగా ఎదగాలంటే ప్రతికూల పరిస్థితులను తట్టుకోవాలి: తమ్మిరెడ్డి శివశంకర్

🔸పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా నాయకుడుగా ఎలా ఎదగాలి అనే అంశంపై శిక్షణ శిబిరం
🔸జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో
🔸జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పార్టీలో పలువురు చేరికలు

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ఆర్.టి.సి. కాంప్లెక్స్ ఎదురుగా హోటల్ జి.ఎస్.ఆర్ హోటల్లో నాయకత్వ లక్షణాలపై నాయకుడుగా ఎలా ఎదగాలి అనే శిక్షణా కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు మరియు పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గతంలో ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ కోర్స్ చదివే విద్యార్థులకు శిక్షణను ఇచ్చిన తమ్మిరెడ్డి శివశంకర్ హాజరై, జనసైనికులకు, ఝాన్సీ వీరామహిళలకు నాయకత్వం పెంపుందించుకొనుటకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నాయకత్వ లోపమన్నది సమాజానికి చేటు తెస్తుందని, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్ధ్యం పెంచుకున్నప్పుడు నాయకులుగా ఎదుగుతారని, అహంకారాన్ని పక్కన పెట్టి, మనం కొన్ని సందర్భాల్లో తగ్గి, సమిష్టిగా అందరినీ కలుపుకొని, త్యాగలు చేసి, అందరి అభిప్రాయాలకు గౌరవించి, ముందుకెళ్లాలని, నాయకులుగా ఓ ప్రక్రియ ద్వారా అవ్వాలే తప్ప, డబ్బులు ఉన్నాయనో, తప్పు త్రోవలోనో అవ్వలేరని ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. మరో నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతీఒక్కరూ కృషిచేయాలని, ఇలాంటి నాయకత్వంపై శిక్షణ తీసుకోవడం వలన భవిష్యత్ లో నిబద్దతతో నాయకులుగా ఎదుగుతారని అన్నారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో పార్టీలో పలువురు చేరికలు జిల్లా చిరంజీవి యువత ముఖ్య ప్రతినిధి, అంజనీపుత్ర చిరంజీవి ప్రజాసేవాసంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, జిల్లా చిరంజీవి యువత ముఖ్య ప్రతినిధులు గురుబిల్లి రాజేష్,శీర కుమార్, పత్రి సాయి కుమార్, శ్రీను, సురేష్,సూరిబాబు, భాస్కర్, మొదలగు వారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరామహిళలు శ్రీమతి పద్మశ్రీ దాస్, శ్రీమతి సర్వమంగళ, శ్రీమతి భారతి, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మర్రాపు సురేష్, డాక్టర్ ఎస్.మురళి మోహన్, పిడుగు సతీష్, కార్పొరేట్ అభ్యర్థులు జనసేన యువనాయకులు హుస్సేన్ ఖాన్, చందు, పార్టీ సీనియర్ నాయకులు మిడతాన రవికుమార్ తదితరులు పాల్గున్నారు.