‘ఒరేయ్ బుజ్జిగా’ లిరికల్‌ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌ హీరో హీరోయిన్లుగా శ్రీలక్ష్మి రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ నిర్మాణసారధ్యంలో తెరకెక్కనున్న ‘ఒరేయ్ బుజ్జిగా…’ చిత్రానికి కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌ మరియు పాటలకి మంచి స్పందన లభించగా… ఈచిత్రం నుండి లిరికల్‌ సాంగ్‌ కలలు చూసినా కన్నులే ను విడుదలచేశారు… కాసర్ల శ్యామ్‌ ఈ గీతాన్ని రచించగా… సిద్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించి అలరిoచాగా… అనూప్‌రూబెన్స్‌ సంగీతాన్ని సమకూర్చారు… హెబ్బాపటేల్‌, వాణీవిశ్వనాద్‌, నరేష్‌, పోసాని తదితరులు ఈ చిత్రంలో నటించారు..