మెహిదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం

హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా మెహిదీపట్నం వద్ద పాదాచారుల కోసం స్కై వాక్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం చేపట్టనుంది. స్కై వాక్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే స్కై వాక్‌ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. మొత్తం 16 లిఫ్ట్‌లతో 500 మీటర్ల పొడవున స్టీల్‌తో స్కైవాక్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న బస్ షెల్టర్స్ ను కూడా రీడిజైన్ చేయనున్నారు. పాదాచారుల స్కైవాక్ 500 మీటర్ల పొడవున స్టీల్‌తో నిర్మించనున్నారు. రైతు బజార్‌లో రెండు లిఫ్ట్‌లను ఏర్పాటు చేయనున్నారు.