కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • పవన్ కళ్యాణ్ 51వ పుట్టినరోజు వేడుకలు పొన్నలూరులో కనపర్తి మనోజ్ కుమార్” ఆధ్వర్యంలో జరిగాయి
  • ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కేవలం ఒక పొన్నలూరు మండలంలోనే 7000 నుండి 10,000 వరకు ఓటింగ్ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి
  • పొన్నలూరులో చాప కింద నీరుల జనసేన పార్టీ వ్యాపిస్తుంది
  • రాబోయే ఎన్నికల్లో పొన్నలూరులో అటు వైస్సార్సీపీకి ఇటు టీడీపీకి గట్టి పోటీ ఇవ్వనుంది

శుక్రవారం ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి 51వ పుట్టినరోజు వేడుకలు మండల అధ్యక్షుడైన కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గ నాయకులు గౌరవనీయులు మేడా రమేష్ నాయుడు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది.
మండలంలో పెట్రోల్ బంక్ నుండి ఎస్.బి.ఐ బ్యాంక్ వరకు ర్యాలీగా వెళ్లడం జరిగింది.

ఈ సందర్బంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ కొన్ని సర్వేలు పొన్నలూరు మండలంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏడువేల నుండి పదివేల వరకు ఓటింగ్ వస్తుంది,. చాప కింద నీరు లాగా రోజురోజుకి జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతుంది.

అటు వైసిపికి ఇటు టిడిపికి రాబోయే రోజుల్లో పొన్నలూరులో జనసేన గట్టి పోటీ ఇస్తుంది అని మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు మండలం జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *