పడాల్ ఆద్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
హుకుంపేట మండలం పాతకోట గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కోటేశ్వరరావు పడాల్ ఆద్వర్యంలో అట్టహాసంగా జరిగింది. గ్రామంలో కేక్ కటింగ్ చేసిన అనంతరం పాఠశాలలోని విద్యార్ధిని, విద్యార్ధులకు నోటు పుస్తకాలు, పెన్నులు అందించారు.అనంతరం తడిగిరి గ్రామంలో కేక్ కటింగ్ చేసి పాఠశాలలోని విద్యార్ధిని, విద్యార్ధులకు వంతాల మోహన్ ఆద్వర్యంలో పెన్నులు, నోటు పుస్తకాలు అందించారు. ఇలాంటి సేవాకార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పడాల్, సురేష్, నాగరాజు, మోహన్, చిరంజీవి, మల్లేష్ నారాయణ మూర్తి అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.