పీలేరులో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

పీలేరు, పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా నెరబైలు గ్రామం, పంచాయతీ నందు జనసైనికులు, జనసేన నాయకులు కలప రవి, మురళి, దేశిరెడ్డి ప్రవీణ్ కుమార్, ముని, ప్రవీణ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకను విజయవంతంగా చెయ్యడం జరిగింది. అలాగే జనసేన పార్టీ పోరాటాన్ని చూసి, ప్రజలకు చేస్తున్న సేవ కార్యక్రమాలు చూసి మరియు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి చిత్తూరు జిల్లా కార్యదర్శి కలప రవి మరియు ఎర్రావారి పాలెం మండల ఉపాధ్యక్షులు మురళి మరియు నెరబైలు గ్రామ, పంచాయతీ యువ నాయకులు, జనసైనికుడు దేశిరెడ్డి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నెరబైలు గ్రామం, పంచాయతీ నుంచి అనేక మంది యువత మరియు వైసీపీ నుంచి జనసేన పార్టీ లోక చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.