జనసేన అధినేత జన్మదిన సందర్భంగా రోడ్డు అభివృద్ధి
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ప్రజా ఉపయోగ కార్యక్రమం చేయటం అత్యంత సంతోషం కలిగించిందని జనసేన పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు అన్నారు. అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అవనిగడ్డ శివారు తిప్పపాలెం ఎస్సీ కాలనీ రోడ్డును జీ.ఎస్.బీతో అభివృద్ధి చేశారు. గత ఇరవై ఏళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్య జనసేనాని జన్మదిన వేడుకల సందర్బంగా పరిష్కారం చేయటం సంతోషంగా ఉందన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-16.18.12-1024x580.jpeg)