కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • “ఇంటింటా – జనసేన జెండా” కార్యక్రమానికి శ్రీకారం

అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో, అనంతపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించి పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా తపోవనం సర్కిల్ నారాయణపురం వెళ్లే ప్రధాన రహదారి గత సంవత్సరాలుగా గుంతలు పడి ప్రజల ఇక్కట్లు దృష్టిలో పెట్టుకొని రోడ్డు మరమ్మత్తు చేసి శ్రమదానం చేయడం జరిగింది. లాయర్ జయరాం రెడ్డి ఆధ్వర్యంలో “ఇంటింటా – జనసేన జెండా” కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ… అనంతపురం నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో ఇంటింటికి జనసేన జెండా ఇవ్వడం జరిగింది. భవాని నగర్ లో కేక్ కట్ చేసి, రైల్వే స్టేషన్ నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్, కార్యక్రమాల నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ ప్రాంతీయ కమిటీ మహిళా సభ్యురాలు పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీ కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు… జిల్లా ప్రధాన కార్యదర్శి కొడిమి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శికాశెట్టి సంజీవ రాయుడు, రాపా ధనుంజయ, కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్ కుమార్, కృష్ణ. నగర కమిటీ సభ్యులు… నగర అధ్యక్షులు బాబురావు, ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, సదాశివ, ప్రధాన కార్యదర్శులు పెండ్యాల చక్రపాణి, రోళ్ళ భాస్కర్, కమతం వెంకటనారాయణ, ధరాజ్ భాష, కార్యదర్శులు శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, శ్రీమతి కుమ్మర సువర్ణమ్మ, లాల్ స్వామి, సంయుక్త కార్యదర్శులు లాల్ స్వామి, ఆకుల ప్రసాద్, వీర మహిళలు శ్రీమతి కాశెట్టి సావిత్రి, శ్రీమతి శ్రీదేవి, కుమారి రూప, శ్రీమతి లక్ష్మి, శ్రీమతి వరలక్ష్మి, శ్రీమతి మంజులా, శ్రీమతి భావన, శ్రీమతి ఉమాదేవి, జనసేన నాయకులు తోట ప్రకాష్, కార్తిక్, పెండ్యాల గురుప్రసాద్, దండు హరీష్ కుమార్, శరత్, మధు, నజీం, వంశీ, ఎల్లుట్ల మంజునాథ్, మడకశిర వెంకటాద్రి నాయక్, చిరంజీవి మరియు వీర మహిళలు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.