కోడికి గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం

కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, కోడికి గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో “నా సేన కోసం నా వంతు” బాధ్యతగా 35 మంది జనసేన సభ్యులు జనసేన పార్టీకి విరాళం అందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో మా వంతు పాత్ర పోషిస్తామని, జనసేన పార్టీ విధి విధానాలను తూచా తప్పకుండా పాటించి జనసేన పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నా సేన కోసం నా వంతు బాధ్యతగా కోడికి గ్రామంలోని రైతులు స్వచ్ఛందంగా వచ్చి పార్టీకి విరాళం ఇచ్చి రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నారు అని అభినందించడం జరిగింది. గ్రామంలోని మహిళలు వారి సమస్యలు తెలియజేశారు. గ్రామంలోని సమస్యలు పరిష్కారం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుంది అని హామీ ఇవ్వడం జరిగింది. జనసేన కార్యకర్తలు అంతా ఐక్యమత్యంతో కలిసి పనిచేసి జనసేన పార్టీని గెలిపించాలని కోరడం జరిగింది. నీతి నిజాయితీగల నాయకులను ఎన్నుకున్నప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అని గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు చలపాడి రమేష్, జనసేన వీర మహిళ షేక్ తార, కార్యక్రమాల కమిటీ మెంబర్స్ ఎర్రి స్వామి, సెట్టూరు మండల అధ్యక్షులు కాంత రాజ్, ఉపాధ్యక్షులు రామలింగ, మండల కమిటీ నాయకులు లక్ష్మణ్, గురు స్వామి, ఐదు కళ్ళు, నాగరాజు, సెట్టూరు సతీష్, బొచ్చుపల్లి రజాక్, కైరేవు తిమ్మరాజు, యాటకల్లో శామ్యూల్, ఐదు కళ్ళు నాగరాజు, లింగదీర్లపల్లి గంగన్న, ముక్కన్నా, శ్రీహర్ష మొదలైన జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.