చిన్నబాబుకి అండగా నిలబడిన 91వ వార్డ్ జనసైనికులు

విశాఖపట్నం, 91 వార్డ్ పాత గోపాలపట్నంకి చెందిన 12 సంవత్సరాల బాబు అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్లు చెబితే ఆ సమయానికి వారి దగ్గర ఏమి డబ్బులు లేవు అని భరత్ అనే జనసైనికుడి ద్వారా జనసేన నరేంద్రకి తెలియజేయగా ఆయన వెంటనే 91వ వార్డ్ లో ఉన్న జనసైనికులు అందరికి పిలుపునివ్వగా అందరు ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆ బాబుకి అండగా నిలబడి ఆ కుటుంబానికి ఆర్ధిక సహయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ లత, మంగరాజు, శేషు, గిరి, అప్పలరాజు, రవి, నాయుడు, శివ, శివ సాయి, నవీన్, సాయి, చారి పాల్గొన్నారు.