అనపర్తి జనసేన ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

అనపర్తి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పెదపూడి గ్రామంలో గ్రామ కన్వీనర్ అమరాది రవి ఆధ్వర్యంలో జనసైనికులు ఘనంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 300 మందికి పైగా దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనపర్తి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పెదపూడి మండల అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి సమన్వయ కర్త రావడ నాగు వీరమహిళ కాశీరాణి మరియు మండలకమిటీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. పెదపూడి జనసైనికులు రాపర్తి సాంబశివ,కొలుసు సింహాచలం, గోపి వీరబాబు, మంచింశెట్టి సతీష్, పొన్నగంటి శ్రీనుసిద్దాని అజయ్, నాయిడు శ్రీను పందిరి వీరబాబు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందదాయకం అని రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా మరింత కృషి చేయాలని కోరారు.