ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేసిన కుంటిమద్ది జయరాం

అనంతపురం, గురుదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ గురువుకు అగ్ర పీఠం వేసిన సంస్కృతి మనది. నేడు ఉపాధ్యాయ దినోత్సవము సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకి మరియు అన్ని రంగాల గురుదేవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ మేము గురు దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నాం జరుపుకోవట్లేదు అంటుంటే చాలా బాధ కలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే చాలా ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి కల్పించినందుకు చింతిస్తున్నాం. మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు వారు పనిచేసే స్కూలు పిల్లల ముందు వారి కుటుంబ సభ్యుల ముందు పోలీసుల ద్వారా నేరగాళ్లకు ఇచ్చే విధంగా నోటీసులు ఇప్పించడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు మరియు ముఖ్యంగా ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. రైతుని, గురువుని బాధపెట్టిన వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ చరిత్రలో సుభిక్షంగా ఉన్న దాఖలాలు లేవు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పును తెలుసుకొని ఉపాధ్యాయుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలని తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి అన్నారు.