వినాయక నిమ్మజ్జన కార్యక్రమంలో జనసేన నాయకులు

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గం, టి.సుండుపల్లి మండల పరిధిలో “శ్రీ వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చెన్నంశెట్టిపల్లి వాస్తవ్యులు 5వ రోజు పురస్కరించుకుని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం సుండుపల్లి సెంటర్ సర్కిల్ నందు సంస్కృతి, సాంప్రదాయ పద్ధతుల్లో డప్పు వాయిద్యాలు, బాణసంచాలు, చెక్కబజన మరియు వివిధ రకాల మాధ్యమాల్లో అంగరంగ వైభవంగా ఉత్సాహంగా స్థానికులు, గ్రామపెద్దలు, గ్రామస్థులు, ప్రజలు, భక్తులు కలిసి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహిస్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భక్తి శ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహిస్తూ… నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొన్నారు.