శ్రీకృష్ణపట్నం గ్రామంలో బత్తుల సుడిగాలి పర్యటన

  • కొంతమందికి ఆర్థిక సహాయాలు, పలు పరామర్శలు, పలకరింపులు

రాజానగరం, జనసేన పార్టీ అభివృద్ధిలో భాగంగా, 175 నియోజకవర్గాల్లో’రాజానగరం’ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెడతానన్న లక్ష్యం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం, రాత్రింభవళ్లు అలుపెరుగని పోరాటం చేస్తున్న రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. రాజానగరం మండలం, శ్రీకృష్ణపట్నం గ్రామంలో జనసేన శ్రేణులతో కలిసి పర్యటించిన బత్తుల కార్యక్రమ వివరాలు.

  1. ఇటీవలే మృతి చెందిన మాచినేడి లక్ష్మమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.
  2. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన, మాచినేని వీర వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పి, కుటుంబ ఖర్చుల నిమిత్తం 10,000/₹ ఆర్థిక సాయం రూపాయలు చేయడం జరిగింది.
  3. రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన ముప్పింశెట్టి పద్మరాజు ను పరామర్శించి, జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
  4. నడుముకి ఆపరేషన్ చేయించుకున్న బుక్క సుబ్బయ్యమ్మ ను పరామర్శించి, వైద్య చికిత్సల నిమిత్తం 5000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
  5. కాళ్లు ప్యాక్చర్ కారణంగా కొప్పన కృష్ణ బాధపడుతుండగా వారికి పలకరించడం జరిగింది.
  6. అనారోగ్యంగా బాధపడుతున్న చిలకలపూడి అమ్మాణి పలకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
  7. పెరాల్సిస్ తో బాధపడుతున్న దేశాల చంద్రరావును పలకరించి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది.
  8. అనారోగ్యంతో బాధపడుతున్న జంగం నాగు కుమారుడు (వయసు 14 సంవత్సరాలు) అంగవైకల్యంతో బాధపడుతున్న బాలుడు వైద్య ఖర్చుల నిమిత్తం, ఆర్థిక సహాయం రూపాయలు 5,000/₹ చేయడం జరిగింది.
  9. అనారోగ్యంతో బాధపడుతున్న సోడసాని వీరయ్యమ్మను పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
  10. ఇటీవల స్వర్గస్తులైన నాగడమూడి ప్రభావతి అబ్బాయిని, వారి చిన్నాని పరామర్శించి, మనోధైర్యం చెప్పడం జరిగింది.
  11. దేనేడి ఆదినారాయణ వియ్యంకుడు మృతి చెందిన కారణంగా వారిని పరామర్శించడం జరిగింది.
  12. సేనం వెంకట్రావు కుమారుడు సేనం హరి చెయ్యి గాయం కాగా, వారిని పలకరించడం జరిగింది.
  13. పిల్లా కాశీ కుమారుడు హార్ట్ ఆపరేషన్ (మూడు నెలలు వయస్సు) విషయం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను కలిసి, బాబు యోగక్షేమాలు తెలుసుకుని వైద్య ఖర్చుల నిమిత్తం 10000/₹ రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
  14. బిక్కవోలు వెంకటేష్ గారు రోడ్డు ప్రమాదంలో తల భాగానికి గాయం కారణంగా వారిని పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
  15. మోటిపల్లి ఆదినారాయణ మనవడికి కడుపులో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది దానికి కారణంగా మెరుగైన వైద్యం చేయించాలని ఖర్చులు నిమిత్తం రూపాయలు 10000/₹ ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
  16. మండారపు వీరబాబు వారి నానమ్మ మండారపు శేషయ్యమ్మ ఇటీవల స్వర్గస్తులు కాగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజనగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణతో పాటు గ్రామ సర్పంచ్ కిమిడి శ్రీరామ్, గ్రామ అధ్యక్షులు దొడ్డ రాంబాబు, యువజన అధ్యక్షులు సుంకర సీతారాం, ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీను, వార్డ్ మెంబర్లు, జనసైనికులు, జనసేన నాయకులు గుల్లింకల లోవరాజు, మద్దిరెడ్డి బాబులు, అరిగెల రామకృష్ణ, చిట్టిప్రోలు సత్తిబాబు తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.