‘నా సేన కోసం.. నా వంతు ‘ కార్యక్రమంపై మండలస్థాయి సమావేశం

కుటుంబ సభ్యులను, స్నేహితులను, సన్నిహితులను, పార్టీ సానుభూతి పరులను “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగస్వామ్యులను చేద్దాం: బండారు శ్రీనివాస్

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరులో ‘నా సేన కోసం.. నా వంతు ‘ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకువెళ్ళడానికి సంబంధించి మండల స్థాయి సమావేశం కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 తారీఖున జరిగిన సంకల్ప పాదయాత్ర ఘనంగా జరిగింది అంటే కేవలం జనసైనికులు, వీరమహిళలు కారణం అని పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు బండారు శ్రీనివాస్. ఏ రాజకీయ పార్టీ మనుగడ అయినా విరాళాల మీద ఆధారపడి ఉంటుంది కానీ జనసేన పార్టీ నిర్వహణ భారం మొత్తం అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఉంది అని స్వచ్ఛందంగా వచ్చే విరాళాలు తప్ప ఆయన అడగరు అని అన్నారు. ఈ విషయంలో స్వచ్ఛంద ఆర్ధిక సహాయం చేసే వారు కూడా ఉండటం వలన మన జనసేనానికి కొంత ఆర్ధిక భారాన్ని తగ్గిస్తున్నారు అని, నవతరానికి చైతన్యం కలిగించే విధంగా, జనాన్ని మంచి లక్ష్యం వైపు ప్రయాణించేలా పారదర్శకత ప్రతిబింబించేలా ఎన్నో వినూత్న ఆలోచనలు చేస్తూ, ఆచరించే రాజకీయ పార్టీ అధినేతగా జనసేనాని రాజకీయ యవనిక పై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్త చరిత్ర లిఖిస్తున్నారు అని అన్నారు. అటువంటి మన నాయకునికి అండగా నిలవాల్సిన సమయం వచ్చింది అని, రేపటి భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతుంటే పార్టీకి అండగా ఆర్థిక పరిపుష్టి చేకూర్చేలా సాగుతున్న ప్రస్థానంలో అందరిని భాగస్వామ్యం ఉండేలా క్రౌడ్ ఫండింగ్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగాలని, మనం నమ్మిన నాయకుడి కోసం, నడిపిస్తున్న సిద్ధాంతాల కోసం, ఆచరిస్తున్న విధానాల కోసం, పార్టీ నిర్వహణ కొరకు మన వంతుగా ఆర్ధిక సహాయం అందించటానికి మార్గం మన ముందు ఉంది అని అన్నారు. సామాన్యుడు సైతం ఇబ్బంది పడకుండా కనీసం పది రూపాయల నుండి ఎంత అయిన విరాళం అందించ వచ్చు అని బండారు శ్రీనివాస్ అన్నారు. “సమూహ నిధుల సేకరణ” పై దృష్టి సారించి ఈ విధానం వివరిస్తూ మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, సన్నిహితులను, పార్టీ సానుభూతి పరులను “నా సేన కోసం నా వంతు” కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయలని, ఎన్నో ఏళ్ళు గా అభిమానాన్ని ఏదో ఒక రూపంలో తెలియచేసే మనం పార్టీ అభివృద్ధికి ఉపయోగించేలా తోచినంత ఆర్ధిక సహాయం అందించేందుకు “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించే విదంగా ప్రతి జనసైనికుడు పని చేయాలని ఆయన సూచించారు.నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ తక్కువ మొత్తములో అయినా ఎక్కువ మందిని ఈ కార్యక్రమములో భాగస్వామ్యం చేసే బాధ్యత మన అందరి భుజాల పై ఉంది అని భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న జనసేన పార్టీకి పది రూపాయల దగ్గర నుంచి ఎంతైనా తోచింది ఫోన్ పే అండ్ గూగుల్ పే నెంబర్ 7288040505 ద్వారా మీ సహాయ సహకారాలు అందించాలని కబండారు శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లు. మండల స్థాయి నాయకులు జనసేన కార్యకర్తలు. జనసైనికులు, పాల్గొన్నారు.