“నా సేన కోసం నా వంతు” ప్రత్తిపాడు జనసేన 2 లక్షల విరాళం

ప్రత్తిపాడు నియోజకవర్గం, జిల్లా కమిటీ సభ్యులు త్రినాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం నా వంతు” కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. గాదె మాట్లాడుతూ… ఈరోజు జిల్లా కమిటీ సభ్యులు త్రినాద్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం జరగటం అలాగే చల్లా వారి పాలెం గ్రామ అధ్యక్షుడు సుధ పిచ్చయ్య “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమంలో తన వంతుగా 100000/- మరియు వారి గ్రామం నుంచి మరొక 100000/- మొత్తం 200000/- ప్రకటించారు ముందుగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం..నా వంతు” కార్యక్రమం ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మండల, గ్రామ అధ్యక్షులదే ముఖ్య పాత్ర అని తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏ కార్యక్రమం తలపెట్టినా మనమందరం కలిసి ఆ కార్యక్రమాన్ని జనాల్లోకి చొచ్చుకుపోయే విధంగా తీసుకువెళ్లే బాధ్యత మనందరిదీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేయాలని, రాష్ట్రంలోనే మన జిల్లా ఒక ప్రత్యేకత స్థానం, ముందు వరుసలో ఉంచాలి అని ఆశించారు. ఎలక్షన్స్ లో నిలబడి దారుణంగా ఓడిపోయినా సరే మన నాయకుడు 6 నెలలు తిరగకుండానే అధికార పార్టీకి వ్యతిరేకంగా కొన్ని లక్షల జనాలతో భవన కార్మికులకు మద్దతుగా మీటింగ్ పెట్టడం అంటే అది మన అధ్యక్షులకు ఉన్న చిత్తశుద్ధి అని అందరూ గమనించాలి. మన భారతంలో యుద్ధం గెలవడంలో అర్జునుడుది ఒక ఆలోచన, దుర్యోధనుడిది ఒక ఆలోచన, శ్రీకృష్ణుడుది ఒక ఆలోచన ఉంటుంది అలాగే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ది రేపు జరగబోయే ఎలక్షన్ కోసం ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంటుంది. మీరు పొత్తుల గురుంచి ఆలోచనలు చెయ్యకుండా మన పార్టీని గ్రామ, మండల, నియోజకవర్గలలో ఎలా బలోపేతం చెయ్యాలో ఆ ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్లాలని, పార్టీకి నష్టం చేసే కార్యక్రమాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్ బాబు, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ, కొర్రపాటి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు పత్తి భవన్నారాయణ, గడ్డం శ్రీను, కొల్లా గోపి మరియు నియోజకవర్గ, సిటీ, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.