ఉరుములు గ్రామ రోడ్డుకి మీరైనా స్పందించండి

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం మారుమూల ఇరగాయి పంచాయితీ ఉరుములు గ్రామ రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది రాజకీయ నాయకుల హామీలతో మోసపోయాం మీరైన స్పందించండి అంటు గ్రామాస్తులతో కలిసి జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ కాగువలస జంక్షన్ నుండి కందులగుడ్డి తిడిగుడా ఉరుములు వరకు తారు రోడ్డు వేస్తామని గత 20 ఏళ్లుగా రాజకీయ నాయకులు హామిలిస్తున్నారు, కానీ రోడ్డు మాత్రం నేటికి చేయటం లేదు రాజకీయ నాయకులు మోసం చేస్తూ ఉచిత హామిలిస్తు మర్చిపోతున్నారు నిజానికి ప్రతి ఎన్నికలకు ఉరుములు రోడ్డు గురించి హామిస్తున్నారు ఎన్నికలు అయిన తరువాత రోడ్డు గురించి మర్చిపోతున్నారు అందుకే శుక్రవారం అల్లూరి జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓతో కలిసి మా గ్రామానికి తారు రోడ్డు మంజూరు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పిఓ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు వెంటనే మాకు తారు రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఉరుములు టిడిగుడానుంచి సుమారు 30 మంది గ్రామస్తులు పాల్గొన్నారు వీరిలో ఇరగాయి మాజీ సర్పంచ్ జాన్ని తమ్మయ్య వార్డు మెంబర్ సెబీ రంగారావు ఎంపిటిసి జాన్ని బొంజోనాయుడు కొర్ర గంగులు జాన్ని లక్ష్మయ్య గబంటు కృష్ణ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.