నవరస నటనా మేరునగధీరుడు కృష్ణంరాజు: ఆళ్ళ హరి
రౌద్ర రస ప్రధానమైన పాత్రలతో పాటూ భక్తి, కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ ఆబాలగోపాలాన్ని మెప్పించిన నవరస నటనా మేరునగధీరుడు కృష్ణంరాజు అని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఆదివారం తెల్లవారుజామున మరణించిన కృష్ణంరాజుకు ఆయన ఘననివాళులు అర్పించారు. నటుడుగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడుగా కృష్ణంరాజు బహువిధాలా ప్రజల మన్ననలు పొందారన్నారు. కృష్ణవేణి సినిమా కృష్ణంరాజు అంటే ఏమిటో తెలియచేస్తే భక్తకన్నప్ప సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారని కొనియాడారు. కృష్ణంరాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసిందని ఆళ్ళ హరి అన్నారు.