కృష్ణంరాజుకు నివాళులర్పించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, తెలుగు సినీ పరిశ్రమలో రెబల్ స్టార్ గా పేరు గడించిన గొప్ప నటులు, పార్లమెంట్ సభ్యునిగా సేవలు అందించిన వ్యక్తి కృష్ణంరాజు మరణవార్త బాధాకరం. జనసేన పార్టీ తరపున ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి స్వగృహం అయినటువంటి మొగల్తూరులో వారి ఇంటి వద్ద ఆదివారం, జనసేన పార్టీ మత్స్యకార విభాగ చైర్మన్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు మరియు నరసాపురం సభ్యులు బొమ్మిడి నాయకర్ నాయకులు మరియు కార్యకర్తలు కృష్ణంరాజుకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.