కృష్ణంరాజుకు నివాళులర్పించిన అమలాపురం జనసేన

అమలాపురం, మాజీ కేంద్రమంత్రి, ప్రముఖ సినీ దిగ్గజం ఉప్పలపాటి కృష్ణంరాజు మరణానికి చింతిస్తూ సోమవారం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ప్రాంగణంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, మున్సిపల్ ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, ఆర్.డి.యస్.ప్రసాద్, బట్టు పండు, నాగ మానస, డి.యస్.యన్.కుమార్, పోలిశెట్టి కన్నా, గంగాబత్తుల కిషోర్, తిక్కా సరస్వతి, చేట్ల మంగతాయారు, కరాటం వాణి, వానపల్లి దేవి, కర్రి లక్ష్మి దుర్గ, నాని, సతీష్, మణికంఠ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.