పెన్షన్, రేషన్ రాక ఇబ్బందిపడుతున్న నిరుపేద వృద్దమహిళకు అండగా జనసేన

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలుమండలం, పందలపాక గ్రామంలో నిరుపేద వృద్దమహిళకు పెన్షన్ మరియు రేషన్ నిలిపివేయడంతో నియోజకవర్గం ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు దృష్టికి మండలంకమిటి సభ్యులు కర్రీశ్రీను, సతీష్, గ్రామ శాఖ అధ్యక్షులు మణికంఠ ఉపాధ్యక్షులు, పతివడా శ్రీను తెలియచేయడంజరిగింది. వెంటనేస్పందించన ఇంచార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు వృద్దమహిళకు బియ్యం, నిత్యావసరసరుకులు మండల ఇంచార్జ్ఇందల వీరబాబు 500 రూపాయలు గ్రామశాఖ అధ్యక్షులు మణికంఠ చేతులమీదుగా అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, మండల ప్రధానకార్యదర్శి వీరరాఘవులు, బిక్కవోలు జనసైనికులు కొండ గోవింద్, జనసేన వార్డు నెంబర్ కోర్ల వీరబాబు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *