జుత్తిగ నాగరాజుని మర్యాదపూర్వకంగా కలిసిన చినకాపవరం జనసేన నాయకులు
ఉండి నియోజకవర్గం, ఇటీవల జనసేన పార్టీలో చేరినటువంటి మహేదేవపట్నం గ్రామానికి చెందిన శెట్టిబలిజ బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రముఖ నాయకులు జుత్తిగ నాగరాజుని చినకాపవరం జనసేన మర్యాదపూర్వకంగా కలసి జనసేన పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతూ… ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా సేవలు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆకివీడు జనసేన పార్టీ మండల కమిటీ అద్యక్షులు కోటికలపూడి తాతాజీ, ఉపాద్యక్షులు అల్లాడి శివంనారాయణ(బాబ్జీ), అడపా ఏసుబాబు (చినకాపవరం వార్డు సభ్యుడు) మరియు చెన్నంశెట్టి ధనసురేష్ లు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-23-at-15.11.02-1024x576.jpeg)