ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట 27 వ రోజు పాదయాత్ర..

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటతో ఇంటింటికీ తిరిగి పవన్ కళ్యాణ్ గారిని సిఎం చేయడమే ధ్యేయం అని రెడ్డి అప్పల నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా ఆదివారం 13 వ డివిజన్ వైఎస్సార్ కాలనీ పాదయాత్ర ను నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూసి అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఏలూరు నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయికి చేరింది. డిప్యూటీ సీఎం ఆళ్ళనాని సమస్యల మీద స్పందించడమే మానేశారు. అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేశారు. ఏలూరుకు వచ్చే నిధులను ఏం చేస్తున్నారో తెలియదు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, అలాంటప్పుడు ఏలూరుకు వచ్చే కోట్లాది రూపాయలు ఏమవుతున్నాయి అని ఆళ్ళనానిని ప్రశ్నించారు. 2 వ సారి గెలిచిన మేయర్ కూడా స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇక్కడ జరుగుతున్న అవినీతిని నివారించడం పోయి కార్పోరేటర్లతో కలిసి భాగస్వాములౌతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ఎన్నికైన నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి రాయితీలు రాకుండా చేస్తున్నారు. ఏలూరులో అభివృద్ధి అనేది లేకుండా చేశారు. చాలా దారుణమైన పరిస్థితి నగర ప్రజలు అనుభవిస్తున్నారు. అర్హులైన వారికి విద్యుత్ బిల్లు సాకు చూపించి వారి పెన్షన్లు, పథకాలు తొలగిస్తున్నారు. కాలనీకి అతి చేరువలో ఉన్న డంపింగ్ యార్డ్ వలన దుర్వాసన రావడం వలన కాలనీ వాసులు అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డుని ఏలూరు శివారుకి తరలించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.. అలాగే పేద మధ్యతరగతి ధనిక అని తేడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో సమస్యలు కనిపిస్తున్నాయి అని ఒక్కో డివిజన్లో ఒక్కో రకమైన సమస్య ఉందని ఆయన తెలిపారు. నగరంలోని ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి నీ చేసుకోవాలని కోరుకుంటున్నారుని ఆ దిశగా ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను రెపరెపలాడిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు,అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కార్యవర్గ సభ్యులు బోండా రాము, కార్యనిర్వహక కార్యదర్శి గొడవర్తి నవీన్ కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు బొద్దపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు, నిమ్మల శ్రీనివాసరావు, సోషల్ సర్వీస్ మురళిరెడ్డి గౌరీ శంకర్, బుధ్ధా నాగేశ్వరరావు, తేజ, చీమల గోపి, సురేష్, స్థానిక కార్యకర్తలు నాని, రాహుల్, విక్రమ్ సింగ్, సాగర్ సింగ్, బుజ్జు సింగ్, శివ, కుమార్, లక్ష్మణ్, కిరణ్, రాజు వీర మహిళలు కావూరి వాణి, సరళ, సుజాత, ఉమా దుర్గా జనసైనికులు పాల్గొన్నారు.