బోనకల్ శాంతి నిలయంలో ఘనంగా రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు

మధిర, బోనకల్ శాంతి నిలయంలో తెలంగాణా రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి రామ్ తాళ్లూరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సంద్భంగా బోనకల్ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం గురించి అహర్నిశలు కష్టపడుతూ పార్టీ కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇస్తూ వారు ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా సామాన్య కార్యకర్తలా ఉంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జనసైనికులకు ఆదర్శంగా నిలుస్తున్న మా అభిమాన నాయకులు రామ్ తాళ్లూరి మరెన్నో ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సలీం షేక్, అశోక్ వల్లంకొండ తదితరుల పాల్గొన్నారు.