బాలకృష్ణను కాపాడిన వైయస్సార్ ఎంత ప్యాకేజీ తీసుకున్నాడు?: ఎస్ వి బాబు

పెడన, జగన్ రెడ్డి మెప్పు పొందే క్రమంలో లక్ష్మీపార్వతి అసలు విషయం బయట పెట్టారు. గతంలో సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కలకలం తెలిసిందే, ఆ కాల్పుల్లో ప్రముఖ నిర్మాత గాయపడటం, తర్వాత బాలకృష్ణ ఇంట్లో వాచ్ మెన్ హత్య జరగడం కూడా తెలిసిందే. లక్ష్మీపార్వతి ఈ విషయాలన్నీ చెబుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనాన్ని చెప్పాలని, తద్వారా జగన్ రెడ్డి మన్ననలను పొందాలని ఆత్రుతలో అసలు విషయం చెప్పేసింది. బాలకృష్ణను రాజశేఖర్ రెడ్డి కాపాడారని దానికి కృతజ్ఞతగా రాజశేఖర్ రెడ్డి పేరుని సమర్థించాలి, వ్యతిరేకించకూడదని లక్ష్మీపార్వతి ఉద్దేశం. ఇక్కడ మనందరం గమనించవలసింది గతంలో రాజశేఖర్ రెడ్డి హంతకులను కాపాడారు అనేది స్పష్టం. రూల్ ఆఫ్ లాను ధిక్కరిస్తూ దుర్మార్గ పాలన సాగించారని లక్ష్మీపార్వతి మాటల్లో దాగి ఉన్న నిగూడార్థం. చట్టం ధనవంతుల చుట్టమని, తనకు ఇష్టమైన వ్యక్తులను, లేదా తనకు లబ్ధి చేకూర్చిన వ్యక్తులను వైయస్సార్ కాపాడుతారని లక్ష్మి పార్వతి చెప్పకనే చెప్పడం జరిగింది. మహానేతగా కీర్తిస్తూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వైసిపి నాయకులు ఇప్పుడేం సమాధానం చెబుతారు. గతంలో బాలకృష్ణని కాపాడారంటే అప్పటినుండే 60 : 40 బంధం ఉందని చెబుతారా..? లక్ష్మీపార్వతి వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? ఆడవాళ్ళ మధ్యవర్తత్వంతో టిడిపి తో 60 : 40 బంధాన్ని కొనసాగిస్తున్న వైసిపి యొక్క అసలు రంగు (పసుపు రంగుతో అంట కాగుతూ) బయటపడింది. ఆంధ్రా ప్రజలు గమనిస్తున్నారు. ఒకరికి మరొకరు (వైసిపి- టిడిపి) చేసుకునే చీకటి సహాయాలను ప్రజలు ఓ కంట కనబడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెబుతారని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.