బాబు పాలూరి ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

  • పార్వతీపురం పట్టణంలో భగత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ

ఉమ్మడి విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణం, స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగిన మహా యోధులలో ఒకరు భగత్ సింగ్…”విప్లవం వర్థిల్లాలి” అంటూ ఆయనిచ్చిన పిలుపు ఈనాటికీ ప్రజా సమస్యలపై పోరాటం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. అలాంటి మహనీయుడు ఏదో పాఠ్య పుస్తకాలలో ఒక పేజీకో, నాలుగు గోడల మధ్య ఫోటోగానో కాకుండా కొన్ని వందలు వేలమంది నడియాడే బహిరంగ ప్రదేశాలలో విగ్రహ రూపంలో దర్శనమిస్తే అన్యాయాలు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే ప్రతీ వ్యక్తికి కొండంత ధైర్యంగా ఉంటుందని భావించి, పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్, ప్రధాన రహదారిలో జనసేన పార్టీ మరియు భగత్ సింగ్ యువజన సేవా సంఘం సంయుక్తంగా జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, వీరమహిళలు ఆగూరు మణి, ఇందు, జనసేన నాయకులు కాత విశ్వేశ్వరరావు, శ్రీను, బలరాం, గౌరి, అనంత్, సంజు, మణికంఠ, వినోద్, చిన్నారావు, ఖాళీ, సంఘ సభ్యులు రాజాన పవన్, చిట్లు గణేష్, వంశీ, రాజు మరియు జనసైనికుల చేతులు మీదుగా భరత్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • “భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ” ప్రారంభోత్సవం

భగత్ సింగ్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు సంఘ సంస్కర్త మజ్జి క్రిష్ణమూర్తి చేతుల మీదుగా “భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ” ప్రారంభోత్సవంలో భాగంగా, పార్వతీపురం పట్టణంలోని గాయత్రీ డిగ్రీ కళాశాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కావలసిన పుస్తకాలు విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది. త్వరలోనే పార్వతీపురంలోని అన్ని కాలేజీలకు ఈ భగత్ సింగ్ మొబైల్ లైబ్రరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మొబైల్ లైబ్రరీకి కూడా రాజాన పవన్ అధ్యక్షులుగా మరియు చిట్లి గణేష్ ఉపాద్యక్షులుగా మరో 10 మంది కమిటీ సభ్యులతో లైబ్రరీ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.