బంటుమిల్లిలో జనసైనికుల అరెస్టు అప్రజాస్వామ్యం

పెడన నియోజవర్గంలోని శివారు ప్రాంతాలైన కృత్తివెన్ను, బంటుమిల్లి మండలల వైద్య అవసరాల కోసం చిన్నపాండ్రాకులో 30 పడుకుల ఆసుపత్రిని గత ప్రభుత్వ హయాంలో నిర్మించడం జరిగింది. ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు సరిగా లేనందున మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలంటూ బంటుమిల్లిలో జనసైనికులు నిరసన దీక్షలు చేపట్టారు. బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు మా జనసైనికుల దీక్షను భంగం చేసి వారిని అరెస్టు చేయడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన దీక్ష చేస్తున్న జన సైనికులను అరెస్టు చేయడాన్ని పెడన నియోజవర్గ జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసిన మా జనసైనికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చిన్న పాండ్రాక ఆసుపత్రి పూర్తిస్థాయి అందుబాటులోకి రాలేదు. వైద్య సిబ్బంది కొరత వలన ప్రజలు తమకు అవసరమైన వైద్య సేవలను పొందలేకపోతున్నారు. కృత్తివెన్ను మరియు బంటుమిల్లి మండలంలోని ప్రజలు తమ వైద్య అవసరాల కోసం సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం, గుడివాడ, భీమవరం వెళుతున్నారు. ఒక్కొక్కసారి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రజా ఆరోగ్యాన్ని, ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. సంబంధిత వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి చిన్న పాండ్రాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాం.