పుట్టపర్తి జనసేన కార్యాలయంలో దసరా సంబరాలు

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో విజయదశమి పండుగ సందర్భంగా జనసేన నాయకుల సమక్షంలో పూజ చేసి జనసేన కార్యకర్తలకు యావత్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్, జనసేన నాయకులు పూల వెంకటేష్, పసివాడి సూర్యనారాయణ, దడిగుంటి నరేంద్ర, ముత్త నరేంద్ర, పూల రెడ్డప్ప, గుడా మధు, గూడా సోము, సోలంకల రాజా, సాకే తేజ, ప్రదీప్ విష్ణువర్ధన్ గూడా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.