దమ్ము, ధైర్యము ఉంటే ఆ 22 ప్రశ్నలకు జవాబు చెప్పాలి: గంధంశెట్టి దినకర్ బాబు

రైల్వే కోడూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ట్వీట్స్ మీద దూషణలతో దాడి చేస్తున్న వారిపై రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు స్పందిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దినకర బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ఈయన ఈ రాష్ట్రానికి మూడున్నర సంవత్సరములు ఏమి చేశారని, వ్యక్తిగత దూషణ లేకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనికి పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి నిజమైన పులి అయితే, వారే స్వయంగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఆయన కాదు కాబట్టి, వారు డబ్బిచ్చి దత్తత తీసుకున్న, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇంకా కొంతమంది మినిస్టర్లు పవన్ కళ్యాణ్ ని తిట్టే దానికోసమే ప్యాకేజీ మినిస్టర్ పదవులు పొందిన మీరు ఇలా స్పందించడం సహజమే కదా అన్నారు. కనీసం తమ తమ శాఖలపై సరైన అవగాహన లేని ఈ మినిస్టర్లు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. మాకు ప్యాకేజ్ ఇచ్చిన వాళ్లు ఎవరు, అది ఊహాగానలతో చెప్పే వాళ్లు ఎవరో ముందుకు రావాలని మేము అడుగుతున్నాము. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యము ఉంటే ఆ 22 ప్రశ్నలకు జవాబు చెప్పితే అప్పుడు మేము దానిలో తప్పు ఉంటే మేమే విత్ డ్రా చేసుకుంటాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిజ్ఞానం లేకుండా మీరు, మీకు పరిపాలన చేత కాకుండా, ఒక కచ్చ సాధింపు పరిపాలన, అవినీతి పరిపాలన చేస్తూ, ఐదు కోట్ల ఆంధ్రులను, దిక్కు తోసిన పరిస్థితులలోకి నెట్టేసిన మీరు, పవన్ కళ్యాణ్ గురించి, జనసేన నాయకులు గురించి మాట్లాడే హక్కు మీకు లేదని స్పష్టం చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ ఉంది అని ప్రజలే గుసగుసలాడుతుంటే, దానిమీద మీరు జవాబు చెప్పలేక వ్యక్తి గతంగా దూషించిన మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.