జనసేనాని పై వైసిపి మంత్రుల వ్యాఖ్యలకు మాకినీడి శేషుకుమారి కౌంటర్.!

కాకినాడ జిల్లా, పిఠాపురం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్వీట్ లో రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి గురించి జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే భుజాల తడుముకున్నట్లుగా మంత్రి రోజా, అంబటి రాంబాబు, ఐటీశాఖ మంత్రి భుజాలు తడుముకుంటున్నారని పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి మీడియాలో మండిపడ్డారు జరుగుతున్న అవినీతిపై మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గళమెత్తితే గొంతు తెగిన మేకలా వైసీపీ మంత్రులు అరుస్తున్నారని చూస్తూ చూస్తూ మూడుసంవత్సరాలు కాలంగడిచిపోయిన పోలవరం ప్రోజెక్టు పూర్తి చేయలేకపోయినందుకు సిగ్గు పడకుండా పవన్ కళ్యాణ్ ని అవమానకరంగా మాట్లాడడం మంచి పద్దతి కాదని రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించేవారే అయితే మీ నాయకుడి పోలవరం పూర్తిచేసి మాట్లాడమని సవాల్ విసిరారు రాజధాని పూర్తి చేయలేని నాయకుడిగా మీ నాయకుడు చరిత్రలో మిగిలి పోతారని ఆంధ్రులు హక్కు అయిన మోదికి మోకరిల్లి ప్రత్యేక హోదా మాట మరచి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ నాయకుడి మెప్పు పొందడానికి రోజా హద్దు అదుపులేని విమర్శలు చేస్తుందని హోదాలో ఉండి దిగజారు విమర్శలు చేయడం ఎంత సిగ్గు చేటో ఆలోచించుకోవాలని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేసారు.