మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు జనసైనికుడు కొట్టే‌ శ్రీహరి చాలెంజ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విమర్శించాడిని‌కి కాదు నీకు మంత్రి పదవి ఇచ్చింది. ప్రజల డబ్బుతో నీకు జీతం ఇస్తుంది, నీ ఖర్చులు భరిస్తుంది, అని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై జనసైనికుడు కొట్టే‌ శ్రీహరి మండి పడ్డారు. నువ్వు మంత్రి అయ్యాక చెయ్యలసిన పని, నీ శాఖపై పట్టుసాధించడం, అది చెయ్యకుండా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తావే. రాష్టనికి ఏ పరిశ్రమను తీసుకరావాలి, యువతకు ఎలా ఉపాది కల్పించాలి మూసివేసిన పరిశ్రమలు ఎందుకు అలా అయ్యాయి ఎమి చేస్తే మళ్ళీ పరిశ్రమలను పునః ప్రారంభించవచ్చు అని ఏనాడు అయినా అలోచించావా కనిసం మీ సలాహ దారులు అయిన మీ సలహాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. మీ ప్రతాపం చూపించాలసింది ప్రజా సమస్యలపై స్పదించిన పవన్ కళ్యాణ్ పై కాదు ప్రజ సమస్యలపైన, ఆధికారంలో లేని పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పొరాడుతుంటే మీరు ఆయనపై పోరాడుతున్నారు, ఇందుకేనా ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటుంది. చూడండి గుడివాడ అమర్ నాథ్ గతంలో పరిశ్రమలకు పుట్టినిల్లు అయిన ఉమ్మడి కడప జిల్లాలోని నందలూరులో 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ఆల్విన్ పరిశ్రమను 305 ఎకరాలలో ప్రారంభించారు. ప్రత్యక్షంగా 1,000కి పైగా, పరోక్షంగా 3,000 మందికి పైగా ఉపాధి కల్పించిన పరిశ్రమ రాయలసీమకే తలమానికంగా ఉన్న పరిశ్రమ మూతపడి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. నీకు చేతనైతే నీకు దమ్మువుంటే నీకు నీ శాఖపై పట్టు ఉంటే నువ్వు నిజంగా మంత్రి అయింది ప్రజల కోసమే అయితే మీ నాయకుడు రాష్ట అభివృద్ధి నిజంగానే కొరుకుంటే మా ఆల్విన్ పరిశ్రమ స్థానంలో ప్రత్యామ్నాయంగా పరిశ్రమను తీసుకురా. ఎందుకంటే మీది ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా అలాంటి ప్రజలు, యువత ఉపాధి లేక ఈ ప్రాంతం నుంచి వలసలు భారీగా పోతున్నారు, మా నందలూరు ప్రాంతంలో పరిశ్రమ అవసరం కాదు అత్యవసరం. ఒక్క పరిశ్రమకు కావలసిన అన్ని వనరులు మా ప్రాంతంలో ఉన్నాయి. చెన్నై 250 కి.మీ దూరంలో, రేణిగుంట విమానాశ్రయంకు 100కి.మీ, కడప విమానాశ్రయంకు 45కి.మీ దూరంలో ఆల్విన్ పరిశ్రమ ఉంది. మీకు ఎటువంటి శ్రమ లేకుండా ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవచ్చు, చాలా అణువైన ప్రదేశం ఇది. మీరు మంత్రిగా ప్రజల్లో స్థానంలో సంపాదించుకొవాలంటే పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేదానికి పాకులాడండి అంతేకాని పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత విమర్శలు చేస్తేనో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి స్వామి భక్తి చూపిస్తేనో కారు గుర్తుపెట్టుకొండి అని అన్నారు.