సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంతకల్ లో 143 యూనిట్లు రక్తదానం

♦️సమాజంలో మెగా అభిమానులు అంటే రక్తదాతలే
♦️ మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి పునీతులు అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
♦️ గొప్ప పుణ్యకార్యంలో అందరిని భాగస్వామ్యం చేసిన పవర్ శేఖర్ అండ్ టీం కు ప్రత్యేక ధన్యవాదాలు
♦️ జనసేన పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ పట్టణం గోపి బ్లడ్ బ్యాంకు నందు జరిగిన రక్తదాన శిబిరంలో మెగా జనసైన్యం సభ్యులు, అభిమానులు, రక్తదాతలు 143 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మెగా అభిమానులు అంటే రక్తదాతలు అనే విధంగా తీర్చిదిద్దిన చిరంజీవి చరిత్రలోనూ, సమాజంలోనూ, అభిమానులు గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతారు అన్నారు. మేనమామల సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తున్న సాయిధరమ్ తేజ్ అంటే అభిమానులందరికీ చాలా గౌరవమని, అలాగే ఎంతో సామాజిక బాధ్యతతో 143 యూనిట్లు రక్తందానం చేసిన రియల్ హీరోస్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత గొప్ప పుణ్య కార్యక్రమం ఏర్పాటుచేసిన గుంతకల్ పట్టణ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువతకు, రాష్ట్ర అధ్యక్షులు పవర్ శేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కురుబ పురుషోత్తం, బండి శేఖర్ గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్, రెడ్ డ్రాప్ సొసైటీ నాయకులు రెహమాన్, గులాం, గోపి చారిటబుల్ ట్రస్ట్ అధినేత గోపాల్ రెడ్డి, ఆర్.వై.ఎఫ్ నాయకులు రాయల్ రంగ, హరీష్, మోహన్, రవి ప్రకాష్, లెజెండ్ బ్లడ్ డోనర్స్ నాయకులు రంజాన్ రక్తదాన శిబిరం కార్యనిర్వాహకులు పామయ్య, ఆటో రామకృష్ణ, మంజు, అమర్నాథ్, ఆటో కృష్ణ, శివ కుమార్, రామకృష్ణ, కొనకొండ్ల శివ, రమేష్ రాజ్, అల్లు మధు, అల్లు రవి, హెచ్.పి.సి శేఖర్, ఆటో పాండు, భాష, అనిల్ కుమార్, అల్లు హరీష్, అల్లు నాసిర్, చికెన్ మధు, సాయి, రామ్ చరణ్ ఫ్యాన్స్ నాయకులు యశ్వంత్, నాగేష్, చిన్న, చెర్రీ, తిమ్మాపురం శివ, దాదు తదితరులు పాల్గొన్నారు.