విశాఖలో హైడ్రామా చేసిన ప్రభుత్వం: రేఖ గౌడ్

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ తన స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖలో శనివారం రాత్రి ప్రభుత్వం పోలీసుల చేత హై డ్రామా చేయించింది అని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఇవ్వవలసిన కనీస భద్రత సెక్యూరిటీ ఇవ్వకుండా నిన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమైన అని రెండు ప్రధాన పార్టీలకు ఒకేరోజు సభ నిర్వహించేటప్పుడు భద్రత ఏర్పాట్లు బలంగా చేయాలని అందులో పోలీసులు వైఫల్యం చెందారని అన్నారు. పోలీసు మంత్రులపైన దాడి చేశారని అనే నెపంతో జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను వందమందికి పైగా అరెస్టు చేయడం భావ్యం కాదని అన్నారు. కర్రలతో రాళ్లతో దాడులు చేస్తే మంత్రులకి గాయాలు కాకపోవడం ఆశ్చర్యం వేస్తుందని గతంలో వాళ్ల అధినాయకుడు చేసిన హైడ్రామానే వీళ్ళు శనివారం చేశారని మండిపడ్డారు. ఆదివారం విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి అనుమతులు తీసుకున్న నాయకుల మీద 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం అదేవిధంగా ఆదివారం జనవాణి కార్యక్రమం జరిగితే వారు చేసిన భూకబ్జాలు రుషికొండ విధ్వంసంపై మాట్లాడుతారని భయంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు పనిచేశారని ఆరోపించారు. పోలీసు అధికారులు పార్టీ నాయకులకు కొమ్ముకాయకూడదని ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతా ఉంటాయని ప్రజాస్వామ్యంలో అందర్నీ సమానంగా చూడాలని హితవు పలికారు. మా అధినేత సహనాన్ని పరీక్షించడం సరికాదని ఆయన చాలా సహనంతో ఓపికతో భరిస్తున్నారని దీన్ని చేతగానితనంగా భావించకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిన్న ప్రభుత్వ పెద్దలు నిర్వహించిన విశాఖ గర్జన అనే ప్రోగ్రాం అట్టర్ ప్లాప్ కావడంతో కడుపు మండి వారి మీద వాళ్ళ వాళ్లతో దాడి చేయించుకొని జనసేన పార్టీ మీద రుద్దడం కరెక్ట్ కాదని అన్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని సంఘటనలను ప్రజల గమనిస్తూనే ఉన్నారని 2024 ఎలక్షన్ల తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు అందరికీ తిరిగి ప్రజలు ఇస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.