అక్రమ అరెస్టులను ఖండించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లిలోని అంబేద్కర్ కి పూలమాలవేసి విలేకరులతో మాట్లాడుతూ శనివారం మా అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ కి రావడం జరిగింది వైజాగ్ రావడానికి ముఖ్య కారణం 16వ తారీకు అనగా ఆదివారం ప్రజల నుంచి సమస్యలను నేరుగా ఆయన తీసుకునే జనవాణి కార్యక్రమం ఇంతవరకు ప్రతిచోటా బాగానే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గర్జన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంపై మా అధినేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందర్నీ కూడా ఆయన ఒకటే సూటి ప్రశ్న అడిగాడు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి మీరు గర్జన ఎందుకు చేస్తున్నారు? ఆ గర్జన ప్రత్యేక హోదా తెచ్చినందుకా లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రవేటికరణ నుంచి ప్రభుత్వ రంగం ద్వారా నడిపడం కోసమా? లేదంటే విపరీతంగా కంపెనీలు ఈ రాష్ట్రంలో నెలకొల్పినందుకా? అనే విషయాన్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పైన ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడు ఆయన మొదటి భార్యది ఏ ఊరు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా మాట్లాడడం అదేవిధంగా ఈ గర్జన అనంతరం గర్జనకి జనసంద్రం రాకపోవడం ఇవన్నీ కూడా మంత్రులు ఇముడ్చుకోలేక ఏదైతే శనివారం సాయంత్రం ఎయిర్పోర్ట్ సమీపంలో మా అధినేత పవన్ కళ్యాణ్ రాక కోసం వేల సంఖ్యలో అభిమానులు, జనసైనికులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయంలో వీళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్లడం అక్కడ కొత్త క్రియేషన్ ఏమిటంటే పార్ట్ 2, పార్ట్ 1 కోడి కత్తి అదే వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తి డ్రామా విజయవంతం చేసుకుని ముఖ్యమంత్రి అయి నేడు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం కోసం పార్ట్ 2 హెల్మెట్ అనే విధానంతో సిపి శ్రీకాంత్ కి ఆ స్క్రిప్ట్ ప్రకారం జనసేన జనసైనికులు వాళ్ల కారులపై కర్రలు విసిరారని, రాళ్లు విసిరారని, హెల్మెట్ విసిరారని క్రియేట్ చేసుకుని వాళ్ళు వచ్చి హుందాగా విమానం ఎక్కి విజయవాడకు వచ్చి హుందాగా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా 2000 మందితో మా అధినేత ఉన్న హోటల్ ని చుట్టుముట్టి మా పార్టీ నాయకులందరినీ అక్రమ కేసులతో హుటాహుటిన వాళ్లందర్నీ కూడా అరెస్టు చేయడం ఒక జగన్నాటకం ఆడించే విధంగా జగన్ రెడ్డి పరిపాలన. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, మీకు త్వరలోనే బుద్ధి చెప్తారు, మీ వద్ద స్పష్టత ఉంటే మీ కార్డు స్పష్టత ఉంటే సిసి ఫుటేజీ తీసుకొని పబ్లిక్ గా దానిని పెట్టి మీరు ఏదైనా మాట్లాడాలి, అదేవిధంగా మీ మంత్రులకి మీ మంత్రులకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినందుకు మరి సిపి శ్రీకాంత్ ని వెంటనే సస్పెండ్ చేయాలి మరి ఎందుకు చేయలేదు? అది మీ చేతకానితనం. మీరు ఏ విధంగా అయితే మా అధినేత పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే మీకు తోచిన విధంగా ఎన్నో విధాలు ఇబ్బందులు పెట్టాలని ఆయన కుటుంబ విషయాల గురించి మాట్లాడుతున్నారు కానీ ఏ రోజూ కూడా మేము మీ కుటుంబ విషయాల గురించి మేము మాట్లాడలేదు. దయచేసి ప్రభుత్వం ఇకనైనా కళ్ళుతెరిచి సరైన మార్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. అలా జరగనిపక్షంలో మా అధినేత పిలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన పిలుపు ఇస్తే మేము ఎలా ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా ముందు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రహీం బాయ్, సందీప్, శ్రీహరి, రహమాన్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.