జనసేన నాయకుల అక్రమ అరెస్టులపై ముమ్మిడివరం జనసేన ఆధ్వర్యంలో ధర్నా

ముమ్మిడివరం, విశాఖలో జనసేన పార్టీ నాయకులపై ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా మరియు పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, జనసేన నాయకుల అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. విశాఖపట్నం నోవాటెల్ లో జరిగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రెస్ మీట్ కి వెళ్తున్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ, పంతం నానాజీ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, చిలకం మధుసూదన రెడ్డి, శెట్టిబత్తుల రాజబాబు, షేక్ రియాజ్, కమల్ జి తదితర నాయకులను పోలీసులు నిర్భంధించి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారు. ఈ అక్రమ అరెస్టులకు నిఒరసనగా ముమ్మ్మిడివరం జనసేన నాయకులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ముమ్మిడివరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా వారు నినాదాలు చేశారు. అక్కడనుండి ర్యాలీగా మహాత్మా గాంధీ విగ్రహం వరకు వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వానికి జ్ఞానోదయం కలుగజేయాలని వారు మహాత్మా గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఈ అరెస్టులు అద్దం పడుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం మరియు కాట్రేనికోన మండలాలకు చెందిన జనసేన పార్టీ అధ్యక్షులు గొలకోటి వెంకన్న బాబు, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేసి జనసేన పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.