అరెస్టు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలి

  • జనసేన అంటే వైసీపీ నాయకులకు ఎందుకు అంత భయం?
  • సమస్యలు వెలికితీస్తే మీలొసుగులు బయట పడతాయని భయమా?

రాజంపేట, సిద్ధవటం, జనసేన పార్టీ ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించే “జనవాణి ” కార్యక్రమం కోసం విశాఖపట్నం విచ్చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటరమణ ఆదేశాల మేరకు సిద్ధవటం మండలం ఉప్పరపల్లె గ్రామంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వం ఓడిపోతామనే భయంతో ఓటమిని ఒప్పుకోలేక ఎదుటి వాడి గెలుపుని నాశనం చేసే విధంగా ఈవైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని ఎన్నో అడ్డంకులు సృష్టించి పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అక్రమ అరెస్టులు చేసిన జనసేన నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.